: అసాధారణం, కానీ నిజం... 'క్విన్ టుప్లెట్స్'కు జన్మనిచ్చిన మహిళ!
ఒక కాన్పులో ఇద్దరు లేదా ముగ్గురు జన్మించడం అందరికీ తెలిసిందే. కానీ, చత్తీస్ గఢ్ లోని సుర్గుజా జిల్లాలోని అంబికాపూర్ పట్టణంలోని సివిల్ ఆసుపత్రిలో 25 ఏళ్ల మనితా, క్విన్ టుప్లెట్స్ (ఐదుగురు పిల్లలు)కు జన్మనిచ్చింది. ఈ తరహా లో ఒకే కాన్పులో ఐదుగురు పుట్టడం అత్యంత అసాధారణమని ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ కేఆర్ తేకమ్ వ్యాఖ్యానించారు. సాధారణ శిశువులతో పోలిస్తే వీరు బరువు తక్కువగా ఉన్నప్పటికీ, ఆరోగ్యంగా ఉన్నారని ఆయన వివరించారు. అందరినీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో పర్యవేక్షణలో ఉంచామని తెలిపారు. ఆ మహిళ ఏడవ నెలలోనే ప్రసవించిందని తెలిపారు. ఇది ఆమెకు రెండవ కాన్పని పేర్కొన్నారు.