: నెటిజన్లను కదిలిస్తున్న ప్రత్యూష చివరి వాట్సప్ స్టేటస్!
"నేను మరణించిన తరువాత కూడా నిన్నే చూస్తుంటాను" (మర్ కే భీ మూహ్ నా తుజ్ సే మొదానా) అని ఉన్న ప్రత్యూష చివరి వాట్స్ యాప్ స్టాటస్ మెసేజ్ ని చూసిన వారి మనసులు బాధతో నిండిపోతున్నాయి. ప్రియుడు రాహుల్ రాజ్ తో వచ్చిన విభేదాల కారణంగానే 'బాలికా వధు' హీరోయిన్ ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్యకు పాల్పడిందన్న సంగతి తెలిసిందే. మరోవైపు ఆమె ఆత్మహత్యకు కారణం రాహులేనని, ఆయనపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్న సెలబ్రిటీల సంఖ్య పెరుగుతోంది.