: తండ్రి తప్పులు కొడుక్కు శాపాలు... యూబీ హోల్డింగ్స్ డైరెక్టర్ గా తప్పుకున్న సిద్ధార్థ మాల్యా


తన తప్పు లేకపోయినా, విజయ్ మాల్యా కుమారుడిగా పుట్టినందుకు సిద్ధార్థ మాల్యాకు ఇబ్బందులు తప్పడం లేదు. బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన మాల్యా, విదేశాలకు పారిపోగా, యునైటెడ్ స్పిరిట్స్, యునైటెడ్ బ్రీవరీస్ లలో పెట్టుబడులు పెట్టిన యునైటెడ్ హోల్డింగ్స్ లిమిటెడ్ లో డైరెక్టర్ హోదాలో ఉన్న సిద్ధార్థ తన పదవికి రాజీనామా చేశాడు. సంస్థలో నాన్ ఎగ్జిక్యూటివ్, నాన్ ఇన్డిపెండెంట్ డైరెక్టర్ హోదాలో ఉన్న ఆయన తన హోదాలకు రాజీనామాలు చేశారని యూబీ హోల్డింగ్స్ నుంచి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ కి ప్రకటన వెలువడింది. కాగా, తన కుమారుడు ఏ తప్పూ చేయలేదని, తిడితే తనను తిట్టాలి కానీ, అతన్ని ఏమీ అనవద్దని మాల్యా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News