: మహిళను వేధించిన టెక్కీ... స్తంభానికి కట్టేసి కొట్టిన బెంగళూరు వాసులు!


రోడ్డుపై వెళుతున్న మహిళను వేధించాడన్న ఆరోపణలపై ఓ టెక్కీని రోడ్డు పక్కనే ఉన్న స్తంభానికి పెడరెక్కలు విరిచి కట్టేసి మరీ దేహశుద్ధి చేశారు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం, ఇద్దరు బిడ్డలకు తండ్రయిన ఓ ఐటీ ఉద్యోగి, గత కొంత కాలంగా 25 సంవత్సరాల మహిళను వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ విషయంలో మహిళ భర్త గతంలో హెచ్చరించాడు కూడా. అయినప్పటికీ మారని సదరు ప్రబుద్ధుడు, శనివారం నాడు వీధిలో నడిచి వెళుతున్న మహిళ వెంట పడ్డాడు. ఆమె వెంటనే తన భర్తకు ఫిర్యాదు చేయడంతో అక్కడికి వచ్చిన కొందరు, అతన్ని కట్టేసి చావగొట్టారు. పోలీసులు వచ్చి తీసుకెళ్లేంతవరకూ అతన్ని రక్తం కారుతున్నా విడిచిపెట్టకుండా కొడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా, జరిగిన ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో, ఆ ఉద్యోగిని హెచ్చరించి వదిలిపెట్టినట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News