: నేను ఆమాయకుడిని, నాకేమీ తెలియదు: ప్రత్యూష బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్
ఇండియాలో అత్యంత విజయవంతమైన టీవీ సీరియల్స్ లో ఒకటిగా నిలిచిన బాలికా వధు (తెలుగులో చిన్నారి పెళ్లికూతురు)లో హీరోయిన్ అనంది క్యారెక్టర్ ను పోషించి, భారత మహిళలకు దగ్గరై, ఆత్మహత్య చేసుకుని తనువు చాలించిన ప్రత్యూష బెనర్జీ పోస్టుమార్టం రిపోర్టు వెల్లడైన తరువాత, ఆమె బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్ మీడియా ముందుకు వచ్చాడు. ప్రత్యూష మరణం వెనుక తన ప్రమేయం లేదని, తాను అమాయకుడినని తెలిపాడు. ఆమె ఆత్మహత్య తననెంతో కలచివేసిందని అన్నాడు. అంతకుముందు ఆమె ఆత్మహత్య చేసుకుని మరణించిందని, హత్య, లేదా అనుమానాస్పద మృతి అనడానికి కారణాలు లేవని పోర్టుమార్టం నివేదిక వెల్లడించిన సంగతి తెలిసిందే.