: ఏపీలో 'ఎం టూ ఐ' వైద్య పరికరాల పార్కు!
తైవాన్ లో పుట్టి, ఆపై పలు దేశాలకు విస్తరించి, ప్రస్తుతం సిలికాన్ వ్యాలీలో వైద్య పరికరాలను తయారు చేస్తూ, వాటికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్న సంస్థ 'ఎం టూ ఐ' త్వరలో ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక పార్కును అభివృద్ధి చేయనుంది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న ఆ సంస్థ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో ప్రత్యేకంగా చర్చలు జరిపింది. తైవాన్ అధ్యక్షుడి సలహాదారు మైఖేల్ వాంగ్ ఆధ్వర్యంలో చంద్రబాబును కలిసిన 'ఎం టూ ఐ' కన్సార్టియం ప్రతినిధులు ఏపీలో వైద్య పరికరాల పార్కు ఏర్పాటుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. వైద్య, రక్షణ, ఐఓటీ రంగాల్లో సేవలందిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి వారు ప్రజెంటేషన్ ఇచ్చారు. అన్ని అంశాలనూ పరిశీలించి, 'ఎం టూ ఐ' పార్కు ఏర్పాటుకు సాధ్యమైనంత త్వరగా అనుమతులను ఇస్తామని బాబు హామీ ఇచ్చినట్టు తెలిసింది.