: ప్రత్యూష బెనర్జీది ఆత్మహత్యే...ఊపిరాడక మృతి చెందింది: పోస్ట్ మార్టం రిపోర్ట్


'బాలికావధు', 'బిగ్ బాస్ సీజన్7' ద్వారా పాప్యులారిటీ సంపాదించుకుని, చిన్నవయసులోనే స్టార్ గా ఎదిగి, అర్థాంతరంగా జీవన పయనాన్ని పూర్తి చేసుకున్న ప్రత్యూష బెనర్జీ పోస్టుమార్టం రిపోర్టు బయటకు వచ్చింది. ఆమె ఊపిరాడక మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కాగా, ఆమె ఆత్మహత్యకు ముందు షాపింగ్ మాల్ కు ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ తో కలిసి వెళ్లిందని తెలుస్తోంది. అక్కడ జరిగిన వాగ్వాదం సందర్భంగా ప్రత్యూషపై రాహుల్ చేయిచేసుకున్నాడని తెలుస్తోంది. దీంతో ప్రత్యూష తట్టుకోలేకపోయిందని, దాని ఫలితంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పలువురు అనుమానిస్తున్నారు. చిన్న వయసులోనే స్టార్ డమ్ సంపాదించుకున్న ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య పట్ల హిందీ టీవీ పరిశ్రమ ఆవేదన వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News