: అల్ బాగ్దాదీకి నరకంలోని మంటలను రుచి చూపిస్తాం: 'ఐఎస్ఐఎస్' చీఫ్ కోసం వేట మొదలైందన్న అమెరికా


మన యాక్షన్ హీరోల సినిమాల్లో వినిపించే పవర్ ఫుల్ డైలాగులను అమెరికా తొలిసారి వినిపించింది. టార్గెట్ అల్ బాగ్దాదీ మొదలైందని అమెరికా దళాలకు చెందిన కల్నల్ స్టీవ్ వారెన్ చెప్పారు. ఆయన మాట్లాడుతూ, ఐఎస్ఐఎస్ చీఫ్ అల్ బాగ్దాదీ ఈ మీడియా సమావేశం చూస్తున్నాడని తనకు తెలుసన్నారు. ఆయన తమకు కావాలని అన్నారు. ఆయన కోసం వేట సాగుతోందని ఆయన చెప్పారు. ఆయనను తప్పకుండా పట్టుకుంటామని ఆయన తెలిపారు. గతంలో ఆయన ప్రధాన అనుచరుడు తమ దాడిలో ప్రాణాలు కోల్పోయాడని ఆయన గుర్తుచేశారు. ఉగ్రవాదంలో గ్రాండ్ మాస్టర్ ఒసామా బిన్ లాడెన్ కు కూడా అదే గతి పట్టిందని, ఇప్పుడు అల్ బగ్దాదీకి కూడా అదే గతి అని ఆయన అన్నారు. ఇప్పటికే వేట మొదలైందని ఆయన చెప్పారు. త్వరలోనే ఆయనకు న్యాయం రుచిచూపిస్తామని ఆయన తెలిపారు. అది ఎంత భయంకరంగా ఉంటుందంటే నరకంలో మంటలను తలపిస్తుందని ఆయన చెప్పారు. బగ్దాదీకి కంటిమీద కునుకు కరవై తమకు చిక్కకుండా ఉండేందుకు ఇరాక్, సిరియాల మధ్య తిరుగుతున్నాడని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News