: ఆ ముద్దు సన్నివేశం ఇబ్బంది పెట్టింది: నర్గీస్ ఫక్రీ
'అజహర్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో టీమిండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ పాత్రను ఇమ్రాన్ హష్మీ పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ పాటలో నర్గీస్ ఫక్రీ నటించింది. ఆ పాట గురించి నర్గీస్ ఫక్రీ మాట్లాడుతూ, ఆ పాటలో ఘాటైన ముద్దు సన్నివేశం ఉందని తెలిపింది. ఈ సన్నివేశం చిత్రీకరణ సందర్భంగా ముద్దు సన్నివేశం సరిగా రాలేదంటూ ఇమ్రాన్ చాలా టేకులు తీసుకున్నాడని చెప్పింది. ఒక దశలో ఇన్ని టేకులు తీసుకుంటున్నారు. ఇది షూటింగేనా? లేక ఎవరో కావాలని చేస్తున్నారా? అని కూడా అనిపించిందని తెలిపింది. టేకులు ఎక్కువ కావడంతో ఇష్టం లేకపోయినా ఇమ్రాన్ హష్మీకి సహకరించాల్సి వచ్చిందని, ఈ షాట్ లో ఇమ్రాన్ హష్మీ బాగా ఎంజాయ్ చేసి ఉంటాడని చెప్పింది. అయితే ఇమ్రాన్ హష్మీ చాలా మాటకారని నర్గీస్ తెలిపింది.