: సీఎం కేసీఆర్ ను అడుగుతున్నా...నా బతుకేంది?: సింగర్ మధుప్రియ


తన కుటుంబంలో తాజాగా చెలరేగిన వివాదం తరువాత అన్నీ సర్దుకుని, తన జీవితం హాయిగా సాగిపోతోందని సింగర్ మధుప్రియ తెలిపింది. ఓ టీవీ ఛానెల్ లో మధుప్రియ, శ్రీకాంత్ దంపతులు మాట్లాడుతూ, మూడోవ్యక్తి ప్రవేశించడం వల్లే తమ మధ్య విభేదాలు వచ్చాయని తెలిపారు. ఆ వివాదం రేగడం వల్లే మంచే జరిగిందని తెలిపింది. దాని వల్ల తమకు చాలా విషయాలు అవగతమయ్యాయని వారు పేర్కొన్నారు. గతంలో జరిగిన సంఘటనలన్నీ మర్చిపోయి హాయిగా ఉన్నామని చెప్పారు. అత్తవారింట్లో బాగా చూసుకుంటున్నారని ఆమె చెప్పింది. ఇంట్లో అత్తమ్మ, అక్కలు పనులు చేసి అన్నీ తనకు సమకూరుస్తారని మధుప్రియ తెలిపింది. తానెవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించాలని కోరింది. ఎవరు ఏమనుకున్నా తానేంటో తనకు తెలుసని, గతంలో జరిగిన సంఘటనలు ఎలాంటివన్నది తనకు మాత్రమే తెలుసని మధుప్రియ పేర్కొంది. అలాగే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత అందరి బతుకులు బాగుపడ్డాయని తెలిపిన మధు ప్రియ, సీఎం కేసీఆర్ కు ఓ విజ్ఞప్తి చేసింది. ఆరేళ్ల వయసు నుంచి తాను చీర కట్టుకుని తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడుతున్నానని తెలిపింది. ఇన్నేళ్ల పోరాటం తరువాత అందరూ కోరుకున్నట్టు అందరి బతుకులు బాగుపడ్డాయి...మరి తన బతుకు సంగతేంటని ప్రశ్నించింది. తెలంగాణ ముఖ్యమంత్రి తనకు దారి చూపించాలని ఆమె కోరింది.

  • Loading...

More Telugu News