: జైల్లో తిరగబడ్డ ఖైదీలు...బందీలుగా అధికారులు
ఉత్తరప్రదేశ్ లోని వారణాసి జైలులో ఖైదీలు తిరగబడ్డారు. ఖైదీలు, జైలు గార్డుకు మధ్య చెలరేగిన వివాదం తీవ్ర రూపం దాల్చింది. దీంతో ఖైదీలు ఒక్కసారిగా గార్డులు, జైలు అధికారులపై తిరగబడ్డారు. ఈ క్రమంలో జైలు సూపరిండెంట్ ఆశిష్ తివారీ, మరో సీనియర్ అధికారి విజయ్ రాయ్ లను బందీలుగా చేసుకున్నారు. ఈ ఘర్షణలో డిప్యూటీ జైలర్ ఆశిష్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘర్షణను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు పలుమార్లు గాల్లోకి కాల్పులు జరిపారని తెలుస్తోంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. పలువురు జిల్లా సీనియర్ అధికారులు వారణాసి జైలును పరిశీలించి పరిస్థితిని ఆరాతీస్తున్నారు.