: పెళ్లి చేసుకుంటే అందరికీ చెప్పే చేసుకుంటా: బాలీవుడ్‌ బ్యూటీ


పెళ్లి చేసుకుంటే అందరికీ చెప్పే చేసుకుంటానంటోంది బాలీవుడ్ బ్యూటీ బిపాసా బసు. 'ఎలోన్' చిత్రంలో తనతో పాటు నటించిన కరణ్ సింగ్ గ్రోవర్ తో బిపాసా బసు వివాహం త్వ‌ర‌లో జరగనుందని బాలీవుడ్ లో వార్త‌లొస్తున్నాయి. అయితే పెళ్లి రూమర్స్‌పై బిపాసాను క్లారిటీ అడిగితే మాత్రం అసలు విషయం చెప్పకుండా కన్ఫ్యూజ్ చేసేస్తోంది. తాజాగా ఓ వాచ్ షోరూమ్‌ను ఓపెన్ చేసేందుకు నోయిడాలోని ఓ మాల్‌కు వచ్చింది. పెళ్లి ఎప్పుడు? అంటూ అడిగిన ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ.. 'నేను పెళ్లి చేసుకోవాల‌నుకుంటే అది అభిమానుల‌కు త‌ప్ప‌క తెలుస్తుంది' అంటూ ఆన్సర్ ఇచ్చింది. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం బిపాసా వివాహం.. ముంబై లోని ఆమె నివాసంలో ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరగనుందని తెలుస్తోంది. రిసెప్షన్ లోయర్ పరేల్ లోని పల్లడియం హోటల్ లో జరగనున్నట్లు స‌మాచారం. మెహంది కార్యక్రమాన్ని ఏప్రిల్ 28 న జుహు లోని విల్లా 69 లో జరగనుందని బాలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి.

  • Loading...

More Telugu News