: ఫొటోలు దిగ‌డానికే ఇక్క‌డికొచ్చారు.. రాహుల్ గాంధీపై బీజేపీ చుర‌క‌లు


రాహుల్ గాంధీపై భార‌తీయ జ‌న‌తా పార్టీ చుర‌క‌లంటించింది. కోల్‌కతా‌లో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కుప్పకూలిన సంఘటనా స్థలాన్ని రాహుల్ గాంధీ ఈరోజు సంద‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై బీజేపీ స్పందిస్తూ రాహుల్ గాంధీ అక్క‌డికి కేవలం ఫోటోల కోసమే వ‌చ్చాడంటూ విమర్శించింది. రాహుల్ గాంధీ త‌న ఉనికిని చాటుకోవ‌డానికి ఇటువంటి సంఘ‌ట‌న‌లను 'లైఫ్‌లైన్'లుగా వాడుకుంటున్నార‌ని అంది. బ్లాక్ లిస్ట్ లో ఉన్న సంస్థకు ఫ్లై ఓవర్ నిర్మాణ కాంట్రాక్టును అప్పగించడంపై రాహుల్ ఎందుకు మాట్ల‌డ‌డంలేద‌ని ప్రశ్నించింది. పశ్చిమ బెంగాల్ లో అప్ప‌ట్లో అధికారంలో ఉన్న సీపీఎం ప్రభుత్వం ఈ కాంట్రాక్టును బ్లాక్ లిస్ట్ లో ఉన్న సంస్థకు అప్పగించిందని, ఇప్పుడు అదే సీపీఎంతో కాంగ్రెస్ ఎన్నికల పొత్తు పెట్టుకుందని బీజేపీ విమర్శించింది.

  • Loading...

More Telugu News