: ఈనెల 9న మాల్యా విచారణకు హాజరుకావాలి: ఈడీ
ఉద్దేశపూర్వక బ్యాంకు రుణాల ఎగవేతదారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాను మరిన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. మాల్యాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ 9లోగా తమ వద్ద విచారణకు హాజరవ్వాల్సిందిగా ఆదేశించింది. అయితే విజయ్ మాల్యా ఈడీ ముందు హాజరవడానికి మే నెల వరకు సమయం కోరుతున్నారు. బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి గుట్టు చప్పుడు కాకుండా దేశం వీడిన ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే మూడుసార్లు సమన్లు జారీ చేసింది. ఐడీబీఐ బ్యాంక్ నుంచి రుణం తీసుకున్న కేసులో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద మాల్యాకు సమన్లు జారీ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు.