: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త...20 వేల ఉద్యోగాల భర్తీకి నిర్ణయం


ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు శుభవార్త అందింది. సుమారు ఆరు గంటలపాటు విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గసమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు విభాగాల్లో ఉన్న 20 వేల ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దశలవారీగా ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నామని మంత్రివర్గ సమావేశంలో తెలిపారు. అలాగే ఇసుక విధానంపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఉచిత ఇసుక విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. ఏప్రిల్, మే నెలల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర పర్యటన చేపట్టనున్నారని మంత్రి వర్గం తెలిపింది. వారానికి ఒకట్రెండు జిల్లాల్లో పర్యటించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. ఉదయం ప్రాజెక్టుల సందర్శన, మధ్యాహ్నం వివిధ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించేలా ప్రణాళికలు రచించనున్నారు.

  • Loading...

More Telugu News