: వాళ్లిద్దరూ రోజూ తాగి కొట్టుకునేవారు: ప్రత్యూష ఇంటి చుట్టుపక్కలవారు
బుల్లితెర నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతుండగా, ఆమె వ్యవహార శైలిపై పలు ఆసక్తికర కథనాలు వినిపిస్తున్నాయి. రాహుల్ రాజ్ సింగ్, ప్రత్యూష బెనర్జీలు ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. గతేడాది పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యూష మీడియాకు కనిపించిన సందర్భంగా నుదుట సిందూర్ తో కనిపించింది. ఆ వీడియోలో స్నేహితురాళ్లకు చేతి ఉంగరం చూపిస్తూ కనిపించింది. ఆ పుట్టినరోజు పార్టీని కూడా రాహుల్ ఏర్పాటు చేశాడని వెల్లడించింది. దీంతో అప్పటికే వారిద్దరికీ వివాహం జరిగిపోయిందని ఊహాగానాలు వెలువడ్డాయి. ఆ తరువాతే వీరిద్దరూ ఒకే ఇంట్లోకి మకాం మార్చారని తెలుస్తోంది. ముంబై శివారుల్లో ఉన్న ఈ నివాసం చుట్టుపక్కల వారిని ఆరాతీయగా, వారు వచ్చిన మొదట్లో చాలా అన్యోన్యంగా కనిపించేవారని చెప్పారు. తరువాత నెమ్మదిగా వివాదాలు చోటుచేసుకునేవని తెలిపారు. వారిద్దరూ తాగి రోజూ కొట్టుకునే వారని వారు చెప్పారు. దీంతో, ఆమె ఆత్మహత్యకు రాహుల్ కారణమయ్యుంటాడని అంటున్నారు.