: ఆ ఒక్క నేత్రం వంద మంది పోలీసులతో సమానం: హైదరాబాద్ సీపీ మహేందర్‌రెడ్డి


హైద‌రాబాద్‌లో శాంతి భద్రతలు కాపాడాలంటే సీసీ కెమెరాలు తప్పనిసరని, ఒక్క నిఘానేత్రం వంద మంది పోలీసుల‌తో స‌మాన‌మ‌ని సీపీ మహేందర్‌ రెడ్డి పేర్కొన్నారు. ఫిల్మ్‌నగర్‌లో 100సీసీ కెమెరాల ఏర్పాటుకు ఫిల్మ్‌నగర్‌ సహకార సంఘం సభ్యులు రూ.30లక్షల చెక్కును సీపీ మహేందర్‌ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడారు. వచ్చే ఏడాదికి నగరంలో లక్ష కెమెరాల ఏర్పాటే లక్ష్యమని మ‌హేంద‌ర్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌ను నేరరహిత నగరంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ క్ర‌మంలో సీసీ కెమెరాలు ప్ర‌ధానపాత్ర వ‌హిస్తాయ‌ని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News