: తన జీవితంలోకి రాహుల్ సింగ్ వచ్చాక మా అమ్మాయి హింసకు గురైంది: ప్రత్యూష బెనర్జీ తండ్రి
దేశవ్యాప్తంగా కలకలం రేపిన ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ ఫేం ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్యపై ఆమె తండ్రి శంకర్ స్పందించారు. ప్రత్యూష ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ తన కూతురు జీవితాన్ని సర్వనాశనం చేశాడని అన్నారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే తన కూతురు జీవితంలోకి రాహుల్ వచ్చాడని, ఆ తర్వాతే ప్రత్యూష హింసకు గురైందని చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రాహుల్ను వదిలిపెట్టేది లేదని అన్నారు. 'నా సోదరి ఆత్మహత్య చేసుకుందంటే నమ్మలేకపోతున్నా'నని ప్రత్యూష సోదరి రిషిత కన్నీటి పర్యంతమైంది.