: ఆ విషయంపై ట్రంప్‌కు పరిజ్ఞానం లేదు: ఒబామా


తన వారసుడిగా రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్‌ను అమెరికా ప్ర‌జ‌లు ఎన్నుకోబోరని ఇప్ప‌టికే ట్రంప్‌పై అమెరికా అధ్య‌క్షుడు బరాక్ ఒబామా విమ‌ర్శ‌లు కురిపించిన సంగ‌తి తెలిసిందే. క్రమశిక్షణగల వారిని మాత్రమే ఎన్నుకోవలసిన అవసరం ఉందని, ఆ విష‌యాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని ట్రంప్‌పై ఆగ్ర‌హం కూడా వ్య‌క్తం చేశారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్షపదవికి రేసులో ముందున్న డొనాల్డ్ ట్రంప్‌పై తాజాగా ఒబామా మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. డొనాల్డ్ ట్రంప్ కు చాలా విషయాలు తెలియవని అణు భద్రత సదస్సులో ఆయ‌న వ్యాఖ్యానించారు. జపాన్, దక్షిణ కొరియాలతో అణు ఒప్పందాల విషయంలో అమెరికా తీరుపై ట్రంప్ కు అంతగా విషయ పరిజ్ఞానం లేదని అన్నారు. డొనాల్డ్ ట్రంప్‌కు విదేశీ వ్యవహారాలపై మరింత అవగాహన అవసరమని ఒబామా పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాలు, అణు ఒప్పందాలు రెండు వేరు వేరు విషయాలని అన్నారు. ఒక్కో దేశంతో ఓ రకమైన విధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

  • Loading...

More Telugu News