: చిన్నారి పెళ్లికూతురు ప్రియుడు అరెస్ట్?... కూపీ లాగుతున్న ముంబై పోలీసులు


బాలీవుడ్ లో కలకలం రేపిన ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ ఫేం ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్యోదంతంలో విచారణ వేగవంతమైంది. నిన్న ముంబైలోని తన ఇంటిలోని ఫ్యాన్ కు ఉరేసుకున్న స్థితిలో ప్రత్యూష చనిపోయింది. ఈ క్రమంలో నిన్నటి నుంచి అడ్రెస్ లేకుండాపోయిన ప్రత్యూష లవర్ రాహుల్ రాజ్ సింగ్ ను నేటి ఉదయం ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఓ గుర్తు తెలియని ప్రాంతంలో ఉంచిన పోలీసులు అతడిని పలు కోణాల్లో విచారిస్తున్నారు. ఆత్మహత్య చేసుకునే ముందు ప్రత్యూష... రాహుల్ కు ఓ మెసేజ్ పంపినట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో ప్రత్యూష మృతదేహానికి పోస్టుమార్టం జరగనుంది. పోస్టుమార్టం నివేదిక వస్తే... ఆమెది హత్యా? ఆత్మహత్యా? అన్న విషయం తేలిపోతుందని పోలీసులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News