: అమెరికాలో హిందూ వ్యతిరేక ప్రచారం చేసిన పాకిస్థానీ...అధికారుల చర్యలు
అమెరికాలో హిందూ వ్యతిరేక ప్రచారం చేస్తోన్న ఓ పాకిస్థానీ-అమెరికన్‌పై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. తన దుకాణంలో మహ్మద్ దార్(65) హిందూ వ్యతిరేక చిత్రపటాలు అంటించడంతో అక్కడి భారతీయ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో అప్రమత్తమైన డెయిరీ క్వీన్ సంస్థ స్పందించింది. ఆ వివాదాస్పద చిత్రపటాలను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకుంది. దీంతో ఆ వ్యక్తి డీలర్‌షిప్‌ను రద్దు చేసింది. దార్ గత ఆరు నెలలుగా ఈ చిత్రపటాలను పాల ఉత్పత్తుల విక్రయశాలలో అంటించి ఉంచాడన్న ఫిర్యాదుతో అధికారులు అతనిపై చర్యలకు ఉపక్రమించారు.