: ఢిల్లీలో దారుణం... కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి మహిళా పారిశ్రామికవేత్తపై అఘాయిత్యం
దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. వ్యాపార లావాదేవీలపై చర్చలకు పిలిచిన ఓ దుర్మార్గుడు మహిళా పారిశ్రామికవేత్తపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిన్న రాత్రి జరిగిన ఈ దారుణంపై సదరు మహిళా పారిశ్రామికవేత్త కన్నాట్ ప్లేస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకెళితే... ఛండీగఢ్ కు చెందిన ఓ దుండగుడు వ్యాపారం గురించి మాట్లాడదామంటూ మహిళా పారిశ్రామికవేత్తకు కబురుపెట్టాడు. అతడి దుర్బుద్ధిని గమనించని బాధితురాలు నేరుగా హోటల్ కు వెళ్లింది. హోటల్ లో మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ను ఆ దుర్మార్గుడు ఆమెకు ఆపర్ చేశాడు. దానిని తాగిన ఆమె స్పృహ తప్పింది. ఇదే అదనుగా అతడు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అతడు ఆమెను అక్కడే వదిలేసి వెళ్లాడు. తీరా మెలకువ వచ్చిన తర్వాత జరిగిన దారుణాన్ని గుర్తు చేసుకున్న బాధితురాలు నేరుగా కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం వేట ప్రారంభించారు.