: రాజధాని నిర్మాణం, ఉద్యోగుల తరలింపులే ప్రధాన ఎజెండా!... నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణం, నిర్దేశిత గడువులోగా ఉద్యోగులను హైదరాబాదు నుంచి అమరావతికి తరలింపులే ప్రధాన ఎజెండాగా ఏపీ కేబినెట్ నేడు కీలక భేటీ నిర్వహించనుంది. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన విజయవాడలో జరగనున్న ఈ భేటీలో ఈ రెండు అంశాలతో పాటు పలు కీలక అంశాలపైనా చర్చ జరగనున్నట్లు సమాచారం. కేంద్రం నుంచి చేయూత లభించనిదే ముందుకు సాగలేమన్న భావనతో ఉన్న చంద్రబాబు... కేంద్రం నుంచి ఆశించిన మేర నిధులు రాబట్టే వ్యూహాన్ని కూడా ఈ భేటీలో రూపొందించనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News