: విండీస్ డ్రెస్సింగ్ రూమ్ లో కోహ్లీ!...గేల్ కు గ్రీటింగ్స్!
మొన్న రాత్రి ముంబైలోని వాంఖడే స్టేడియంలో టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ చేసిన వీర విహారం జట్టుకు విజయాన్నందించలేదు. ఈ క్రమంలో అప్పటిదాకా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టైటిల్ తమదేనన్న ధీమాతో ప్రతి మ్యాచ్ లో సత్తా చాటిన కోహ్లీ మోములో తీవ్ర నిరాశ. అంతా అయిపోయిందంటూ నిర్వేదం. అయితే ఇతర జట్ల క్రికెటర్లలా అతడు మైదానంలోనే కుప్పకూలిపోలేదు. క్రీడా స్ఫూర్తితో క్షణాల్లోనే వేదన నుంచి తేరుకున్నాడు. ఇక తనపై విజయం సాధించింది ఐపీఎల్ లో తన జట్టు సభ్యుడేనన్న విషయం గుర్తొచ్చిందేమో... వెంటనే వెస్టిండీస్ డ్రెస్సింగ్ రూంకు వెళ్లాడు. అప్పటికే చొక్కాలు విప్పి చిందులు తొక్కుతున్న రాయల్ ఛాలెంజర్స్ జట్టు సభ్యుడు క్రిస్ గేల్ ను అభినందించాడు. అతడితో కలిసి విక్టరీ సింబల్ చూపుతూ ఫొటోకు పోజిచ్చాడు.