: యూబీ గ్రూపు డైరెక్టర్ పదవికి మాల్యా పుత్రరత్నం రాజీనామా!


లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ప్రమోట్ చేసిన యునైటెడ్ బ్రూవరీస్ (హోల్లింగ్స్) లిమిటెడ్ (యూబీహెచ్ఎల్) డైరెక్టర్ల బోర్డు నుంచి ఆయన పుత్రరత్నం సిద్ధార్థ మాల్యా తప్పుకున్నారు. విజయ్ మాల్యా చైర్మన్ గా ఉన్న యూబీహెచ్ఎల్ డైరెక్టర్ల బోర్డులో సిద్ధార్థ మాల్యా... నాన్ ఎగ్జిక్యూటివ్, నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్ గా కొనసాగారు. బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయల రుణాలను ఎగవేసిన విజయ్ మాల్యా... లండన్ చేరిన మరుక్షణమే చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. తప్పు తాను చేశానని పేర్కొన్న మాల్యా... తన కొడుకును మాత్రం ఏమీ అనవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో మార్చి 31న సిద్ధార్థ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. అంతేకాకుండా కంపెనీలోని తన కార్యాలయాన్ని కూడా ఆయన ఖాళీ చేశారు. ఈ మేరకు నిన్న యూబీహెచ్ఎల్... బీఎస్ఈకి తెలిపింది.

  • Loading...

More Telugu News