: హెచ్ సీయూ వీసీ అప్పారావుపై ఎంపీ వీహెచ్ హైకోర్టులో పిల్
రోహిత్ వేముల ఆత్మహత్యతో అట్టుడుకుతున్న హెచ్సీయూ వీసీని బదిలీ చేయాలంటూ కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. వీసీ అప్పారావు బాధ్యతలు చేపట్టడంపై ఆయన ఈ పిల్ దాఖలు చేయడం విశేషం. సుదీర్ఘ సెలవులో ఉన్న ఆయన మళ్లీ బాధ్యతలు చేపట్టడంతో హెచ్సీయూలో పరిస్థితులు అదుపుతప్పాయని ఆయన అందులో పేర్కొన్నారు. ఆయనను హెచ్సీయూ నుంచి బదిలీ చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ ఆయన పిల్ లో కోరారు. అలాగే హెచ్సీయూలో చేపట్టిన బోధన, బోధనేతర సిబ్బంది నియామకాన్ని నిలిపివేయాలని ఆయన కోరారు.