: చెక్ బౌన్స్ కేసులో... సినీ నిర్మాత శింగనమల రమేష్ కు ఏడాది జైలు శిక్ష
ప్రముఖ సినీ నిర్మాత శింగనమల రమేష్ కు రెండు వేర్వేరు కేసుల్లో జైలు శిక్ష పడింది. రెండు చెక్ బౌన్స్ కేసుల్లో న్యాయస్థానం ఆయనను దోషిగా నిర్ధారించింది. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం జిల్లెల గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి నుంచి శింగనమల రమేష్ 15 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారు. అతనికి రమేష్ చెల్లని చెక్ ఇచ్చారు. దీంతో ఆయన కర్నూలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం ఆయనకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.