: భారీ పేలుడు శబ్దంతో ఉలిక్కిపడిన పారిస్...ఆందోళన వద్దన్న పోలీసులు!
ఫ్రాన్స్ రాజధాని పారిస్ మరోసారి ఉలిక్కిపడింది. గత ఏడాది నవంబర్ లో పారిస్ ఉగ్రదాడులతో దద్దరిల్లిన సంగతి తెలిసిందే. తాజగా మరోసారి పారిస్ లో భారీ పేలుడు సంభవించింది. దీంతో మళ్లీ ఉగ్రవాదులు పంజా విసిరారని అంతా భావించారు. పారిస్ రోడ్లపై అగ్నిమాపకసిబ్బంది హడావుడి, పోలీసుల పహారా పెరగడంతో అంతా మరో ఉగ్రదాడి జరిగిందని ఆందోళన చెందారు. అయితే అది ఉగ్రదాడి కాదని, ఆందోళన వద్దని భద్రతాధికారులు చెప్పారు. సెంట్రల్ పారిస్ లోని స్టాక్ ఎక్చేంజ్, ఏఎఫ్పీ న్యూస్ ఏజెన్సీ ప్రధాన కార్యాలయానికి సమీపంలోని నివాస ప్రాంతం నుంచి ఈ పేలుడు శబ్దం వచ్చినట్టు అధికారులు గుర్తించారు. గ్యాస్ లీక్ వల్ల ఈ పేలుడు సంభవించిందని పారిస్ పోలీస్ అధికారి చెప్పారు.