: సెమీస్ లో భారత్ ఓటమిపై మెసేజ్ పెట్టిన పాకిస్థాన్ నటి వీణామాలిక్
టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో వెస్టిండీస్ చేతిలో భారత్ ఓటమిపాలు కావడంతో పాకిస్థానీలు పండగ చేసుకుంటున్నారు. వారిలో భారత్ లో పలు సినిమాల్లో నటించి ఆర్థికంగా నిలదొక్కుకున్న పాకిస్థానీ నటి వీణా మాలిక్ కూడా చేరింది. వరల్డ్ కప్ ఏదయినా పాకిస్థాన్ తో టీమిండియా మ్యాచ్ అంటే 'మోకా మోకా' అంటూ ఓ యాడ్ టీవీల్లో ప్రత్యక్షమవుతుంది. ఈ యాడ్ లో భారత్ పై పాక్ గెలిస్తే సంబరాలు చేసుకుందామని పాక్ అభిమాని 'మోకా (అవకాశం) మోకా (అవకాశం)' అంటూ ఓ అట్టపెట్టెలో టపాసులు తెస్తాడు. ఓటమిపాలవ్వడంతో ఆ అట్టపెట్టెను మళ్లీ యథావిధిగా దాస్తాడు. ఇది బాగా పాప్యులర్ యాడ్. దీనిని గుర్తుచేస్తూ...వీణామాలిక్ ట్వీట్ చేసింది. 'వాట్ ఎ మ్యాచ్...వెల్ డన్ విండీస్...యూ డన్ ఇట్...భారతదేశానికి పాకిస్థాన్ నుంచి ఓ సందేశం మోకా మోకా' అంటూ ట్వీట్ చేసింది. దీనిపై భారత అభిమానులు మండిపడుతున్నారు.