: ఏకాభిప్రాయం కుదిరింది.. ఇక ప్రభుత్వ ఏర్పాటే తరువాయి: రామ్ మాధవ్
జమ్మూకాశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ, పీడీపీల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఈరోజు మీడియాకు చెప్పారు. వచ్చే రెండు, మూడు రోజులలో పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన పేర్కొన్నారు. మెహబూబా ముఫ్తీ, బీజేపీ నాయకుడు నిర్మల్ సింగ్ ల మధ్య నిన్న జరిగిన చర్చలలో ఏకాభిప్రాయం కుదిరిందని రామ్ మాధవ్ తెలిపారు. మరోవైపు పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ జమ్మూ కాశ్మీర్ మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా ఈ నెల నాలుగో తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారని పీడీపీ వర్గాలు ఇప్పటికే ధ్రువీకరించాయి.