: షీనాబోరా హ‌త్య‌కేసులో ఇంద్రాణి బెయిల్ పిటిషన్ను తిర‌స్క‌రించిన కోర్టు


కన్నకూతురు షీనాబోరాను హత్యచేసిన కేసులో ఇంద్రాణి ముఖర్జియా పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈరోజు తిరస్కరించింది. అవసరం అయితే ఇంద్రాణీ ప్రయివేట్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకునేందుకు అనుమతి ఇచ్చేందుకు న్యాయస్థానం సుముఖత వ్యక్తం చేసింది. కాగా తన ఆరోగ్యం బాగోలేదని తనకు బెయిల్ మంజూరు చేస్తే ఆసుపత్రిలో చూపించుకుంటానని ఇంద్రాణీ ముఖర్జియా బెయిల్ కోసం దాఖలు చేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News