: అవకాశాల్లేక అల్లాడిపోతున్న సోనమ్ కపూర్


ఒకదాని తర్వాత ఒకటిగా రెండు సూపర్ హిట్ సినిమాలలో నటించినప్పటికీ తనకు కొత్త అవకాశాలు మాత్రం రావడం లేదని బాలీవుడ్ భామ సోనం కపూర్ తల్లడిల్లుతోంది. 'ప్రేమ్ రతన్ ధన్ పాయో', 'నీర్జా' వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన సోనమ్ కపూర్ వీటి తరువాత ఇబ్బడి ముబ్బడిగా అవకాశాలు వస్తాయని ఆశపడింది. అయితే ఆమె ఆశలపై నీళ్లు చల్లుతూ ఒక్క అవకాశం కూడా ఆమె తలుపుతట్టలేదు. నీర్జా సినిమా విడుదలై రెండు నెలలు నిండినా ఒక్క అవకాశం రాకపోవడం ఆశ్చర్యంగా ఉందని సోనమ్ తెలిపింది. రెండు నెలలుగా పని లేకుండా ఉండడంతో ఒత్తిడికి గురవుతున్నానని సోనమ్ కపూర్ అంటోంది. కాగా, సోనమ్ కపూర్ ప్రముఖ నటుడు అనిల్ కపూర్ కుమార్తె అన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News