: నష్టాలు మూటగట్టుకున్న స్టాక్ మార్కెట్లు


ఈరోజు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 72 పాయింట్లు నష్టపోయి 25,269 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 25 పాయింట్లు నష్టపోయి 7,713 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలో అత్యధికంగా లాభపడ్డ షేర్ల విషయానికొస్తే, బ్యాంక్ ఆఫ్ బరోడా సంస్థ షేర్లు 3.98 శాతం లాభపడి రూ.152.85 వద్ద ముగిశాయి. ఐటీసీ, ఏసీసీ, బీహెచ్ఈఎల్, ఎల్ అండ్ టీ సంస్థల షేర్లూ లాభపడ్డాయి. కాగా, బాష్ సంస్థ షేర్లు అత్యధికంగా 4.26 శాతం నష్టపోయి రూ.19,900 వద్ద ముగిశాయి. ఇంకా నష్టపోయిన సంస్థల్లో భారతీ ఎయిర్ టెల్, టెక్ మహీంద్రా, ఐడియా, టీసీఎస్ లు ఉన్నాయి.

  • Loading...

More Telugu News