: ఉత్తర కొరియాలో ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఇక మాయం!
సామాజిక మాధ్యమాల ద్వారా ఆన్‌లైన్ సమాచారం విపరీతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఉత్తర కొరియా ప్రభుత్వం ఆ దేశంలో పలు వెబ్‌సైట్లను నిషేధించనుంది. ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ తదితర సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లతో పాటు తమ శత్రుదేశమైన దక్షిణ కొరియా వెబ్‌సైట్లను కూడా నిషేధిస్తున్నామని ఉత్తరకొరియా ప్రకటించింది. కొంత కాలం వరకు ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ సైట్లను నిషేధిస్తున్నామని, అక్రమంగా ఉపయోగించే ప్రయత్నం చేయొద్దని ఉత్తర కొరియా పేర్కొంది. పలు సామాజిక మాద్యమాలపై చైనాలో కూడా నిషేధం ఉన్న విషయం తెలిసిందే.