: 'పెళ్లిపుస్తకం పార్ట్ 2' చేయాలి...అదీ మేమే చెయ్యాలి: దివ్యవాణి


'పెళ్లిపుస్తకం' సినిమా పార్ట్ 2 లో నటించాలని ఉందని...అందులో కూడా రాజేంద్రప్రసాద్ హీరోగా, తాను హీరోయిన్ గా నటించాలని అప్పటి 'పెళ్లిపుస్తకం'లో ప్రధాన పాత్ర పోషించిన దివ్యవాణి తెలిపింది. 'పెళ్లిపుస్తకం' సినిమా 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె ఓ టీవీ చానెల్ తో మాట్లాడుతూ, ఆ సినిమా తీసినప్పుడు వల్లెవేసిన డైలాగులకు అర్థాలు అప్పట్లో తెలియదు కానీ ఇప్పుడు ప్రతి రోజూ వాటిని గుర్తుచేసుకుంటానని చెప్పింది. ఈ సినిమాలోని టైటిల్ సాంగు ఇప్పటికీ ప్రతి పెళ్లి పందిరిలోనూ వినిపించేలా బాపు, రమణ అద్భుతంగా రూపొందించారని ఇందులో ప్రధాన పాత్ర పోషించిన రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ సినిమా ఆర్టిస్టుల భావాల ప్రకటనకు దిక్సూచిలా పనిచేస్తుందని అన్నారు. ఈ సినిమాలో ప్రతి భావాన్ని బాపు బొమ్మగా గీసి, తన ద్వారా ఆ బొమ్మలకు ప్రాణం పోశారని ఆయన చెప్పారు. తన మాటలతో రమణ భావితరాల దంపతులకు ఎన్నో సూచనలు, విలువైన సలహాలు ఇచ్చారని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News