: ఎలుకల‌ను చంపండి, బ‌హుమ‌తి పొందండి: ప్రజలకు పాకిస్థాన్‌ ఆఫర్


ఎలుక‌ల బెడ‌దతో పాకిస్థాన్‌లోని పెషావర్ న‌గ‌రం బెంబేలెత్తిపోతోంది. మామూలు ఎలుక‌ల క‌న్నా అధిక పొడ‌వున్న‌ 'పెద్ద‌సైజు' ఎలుక‌లు పెషావ‌ర్‌లో విపరీత నష్టాన్ని కలిగిస్తున్నాయి. దీంతో వాటి నివారణకు అక్క‌డి అధికారులు ఓ మార్గాన్ని అనుస‌రించడానికి స‌మాయ‌త్త‌మ‌య్యారు. ప్ర‌జ‌లు ఎవరికి అనుకూలమైన పధ్ధతిలో వారు ఎలుకలను చంపి, నివారణకు తోడ్పడాల‌ని కోరుతున్నారు. ప్రభుత్వం ఇంటింటికీ ఎలుకలమందు కూడా పంపిణీ చేస్తోంది. అంతేకాదు.. ఒక ఎలుకను చంపితే 25 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఒక్కొక్కరూ ఎన్ని ఎలుకలనైనా చంపొచ్చు. ఇందుకోసం వాటర్‌ అండ్‌ శానిటేషన్‌ సర్వీస్‌ సంస్థ నాలుగు పట్టణాల్లో కొన్ని పాయింట్లు ఏర్పాటు చేస్తోంది. చచ్చిన ఎలుకల్ని తీసుకుని వాటిని తెచ్చినవారికి నగదు ప్రోత్సాహకం ఇవ్వనుంది. కొంతకాలంగా అక్కడ సాధారణ ఎలుకల కంటే పెద్దగా 22-30 సెం.మీ.ల పొడవున్న ఎలుకలు ఎక్కువగా సంచరిస్తున్నాయని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News