: వచ్చే అసెంబ్లీ సమావేశాలను అమరావతిలోనే నిర్వహిస్తాం: మంత్రి నారాయణ
వచ్చే అసెంబ్లీ సమావేశాలను నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోనే నిర్వహిస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తాత్కాలిక సచివాలయ నిర్మాణాన్ని గడువులోగా పూర్తి చేస్తామని, ల్యాండ్ పూలింగ్ రైతులకు త్వరలో పట్టాలిస్తామని ఆయన తెలిపారు. జూన్-జులై నాటికి ఉద్యోగుల తరలింపు ప్రక్రియ పూర్తవుతుందని అన్నారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీకి వస్తున్న ఎమ్మెల్యేల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. వైఎస్సార్సీపీలో ఉంటే ప్రజాసేవ చేయలేమని భావించిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారని నారాయణ అన్నారు.