: దాడిలో గాయపడిన జవాన్లను మావోయిస్టులు కాల్చి చంపారు!: సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు
ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడ జిల్లాలో మందుపాతరపెట్టి సీఆర్పీఎఫ్ జవాన్లను బలిగొన్న మావోయిస్టులు అంతటితో ఊరుకోలేదని సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు తెలిపారు. సీఆర్పీఎఫ్ జవాన్ల రాకపోకల గురించి పక్కా సమాచారంతో మావోలు పంజా విసిరారని వారు చెప్పారు. బాంబుదాడికి పాల్పడిన అనంతరం సంఘటనా స్థలిని మావోయిస్టులు సందర్శించారని వారు వెల్లడించారు. ఇంకా ఎవరైనా సీఆర్పీఎఫ్ జవాన్లు బతికి ఉన్నారా? అని చూశారని వారు చెప్పారు. ముగ్గురు బతికే ఉన్నారని నిర్ధారించుకుని వారి తలలోకి, గుండెల్లోకి తుపాకులతో కాల్చారని సీఆర్పీఎఫ్ డీజీ దుర్గాప్రసాద్ తెలిపారు.