: నేను పార్టీ మారాకైనా జగన్ లో మార్పు రావాలి: జ్యోతుల నెహ్రూ


‘నేను పార్టీ మారాకైనా వైఎస్సార్సీపీ అధినేత జగన్ లో మార్పు వస్తుందని భావిస్తున్నాను’ అని ఆ పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. త్వరలో టీడీపీలోకి వెళ్లనున్న ఆయన ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీలో చేరాలని తాను అనుకోలేదని, తనను ప్రజలే ఆ పార్టీలోకి తీసుకెళ్తున్నారని అన్నారు. రాజకీయ పార్టీగా వైఎస్సార్సీపీ పరిణితి చెందలేదని విమర్శించారు. పార్టీ అభ్యున్నతి కోసం అన్నీ దిగమింగుకుని పనిచేశానన్నారు. ఆ పార్టీలో సమష్టి ఆలోచనలు, నాయకత్వం లేవని, అందుకే పార్టీ మారాలనుకున్నానని అన్నారు. పీఏసీ పదవి కోసం తానెప్పుడూ ఆశపడలేదన్నారు. ఎన్నో పదవులు తన చేతి దాకా వచ్చిపోయాయని, పదవులు తనకు లెక్కకాదని జ్యోతుల నెహ్రూ అన్నారు.

  • Loading...

More Telugu News