: ప్రేమ జంటల గురించి ఇష్టమొచ్చినట్టు రాస్తున్నారు: క‌రీనా క‌పూర్


బాలీవుడ్ సొగసరి కరీనా కపూర్ పెళ్లి తర్వాత సినిమాలను కాస్త‌ తగ్గించింది. అందాల ప్రదర్శనకూ కాస్త‌ దూరంగా ఉంటూ కథాంశాల ఎంపికలో పంథాను మార్చుకుంది. అభినయానికి ఆస్కారమున్న కొత్తదనంతో కూడిన సినిమాలవైపు మొగ్గుచూపుతోంది. తాజాగా క‌రీనా ఉన్న‌ట్టుండీ బాలీవుడ్‌లో జరుగుతున్న బ్రేకప్‌లు.. వివాహాలపై ప‌లు వ్యాఖ్యాలు చేసింది. సినీ తారలు బ్రేక‌ప్ అవ్వ‌డంపై అసలైన కారణాలు ఎవ‌రికీ తెలియ‌వ‌ని, చాలామంది ప్రేమ జంటల గురించి ఏమీ తెలుసుకోకుండా ఇష్టమొచ్చినట్టు రాస్తున్నారని క‌రీనా అంటోంది. వీరి గురించి చ‌ర్చించ‌డానికి అస‌లు స‌రైన పాయింటే లేద‌ని వ్యాఖ్యానించింది. వారి మధ్య ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడటం అంత మంచిది కాదు అని చెబుతోంది. ‘వివాహం అనేది ఒక ఉద్యోగమే. భార్యభర్తల్లో ఎవరో ఒకరు నిరంతరం పనిచేస్తూనే ఉండాలి. సైఫ్‌ షూటింగ్‌కి వెళ్లినప్పుడు నేను ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటాను. నేను షూటింగ్‌కు వెళ్లినప్పుడు సైఫ్‌ పిల్లల్ని చూసుకుంటారు. ఇంటి పనులు చూసుకునేందుకు మాకు మేమే సమయాన్ని కేటాయించుకుంటాం’ అని చెబుతోంది. ఇండియాలో ఓ న‌టి పెళ్లి చేసుకుంటే.. ఇక ఆ న‌టి కెరీర్ ఫినిషైపోయిన‌ట్లే భావిస్తారు. కానీ ఇప్పుడు ట్రెండ్ చేంజై పోయింది అని చెప్పింది. కరీనా తాజా చిత్రం 'కీ అండ్ కా' చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది.

  • Loading...

More Telugu News