: మీడియా మొఘల్ మాజీ భార్యతో రష్యా అధ్యక్షుడు పుతిన్ డేటింగ్!


రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు సంబంధించిన మరో వార్త ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. కరాటే యోధుడిగానే కాక లవర్ బాయ్ గా పుతిన్ ను అభివర్ణిస్తూ ప్రపంచ మీడియా లెక్కలేనన్ని కథనాలను రాసింది. తాజాగా అమెరికాకు చెందిన ఓ వారపత్రిక పుతిన్ కు సంబంధించిన మరో సంచలన కథనాన్ని రాసింది. మీడియా మొఘల్ గా ప్రసిద్ధిగాంచిన రూపర్ట్ మర్దోక్ మాజీ భార్య వెండీ డెంగ్ తో పుతిన్ ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నాడని సదరు పత్రిక ఓ కథనాన్ని రాసింది. 2013లో తన భార్యకు విడాకులిచ్చిన పుతిన్... ఆ తర్వాత పలువురు ప్రముఖ మహిళలతో ప్రేమాయణం నెరపుతున్నారని కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. తాజాగా రూపర్ట్ మర్దోక్ మాజీ భార్యతోనూ ఆయన డేటింగ్ చేస్తున్నాడన్న వార్తలపై పెద్ద చర్చే నడుస్తోంది. ఇప్పటిదాకా పుతిన్, వెండీ డెంగ్... ఎక్కడా కలిసి కనిపించలేదు. అయితే పుతిన్ హాలీడే స్పాట్ గా పేరొందిన సెయింట్ బార్ట్ తీరంలో వెండీ డెంగ్ లగ్జరీ బోట్ పార్క్ చేసి కనిపించిన వైనాన్ని ఆసరా చేసుకుని అమెరికా పత్రిక ఈ కథనాన్ని రాసింది.

  • Loading...

More Telugu News