: హెచ్‌సీయూలో పట్టువీడని విద్యార్థులు.. వీసీకి వ్యతిరేకంగా నినాదాలు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో విద్యార్థుల నిరసన కొనసాగుతోంది. వీసీ అప్పారావును తొలగించాలని డిమాండ్ చేస్తూ.. ఈరోజు పరిపాలన భవనం వద్ద విద్యార్థులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. భద్రతా సిబ్బంది విద్యార్థులను శాంతింపజేసే ప్రయత్నం చేసినా వారు పట్టువీడలేదు. వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టినా ఇంతవరకు అప్పారావును ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. యూనివర్సిటీలో నిన్న కూడా ఆందోళన కొనసాగిన విషయం తెలిసిందే. కేరళకు చెందిన వామపక్ష పార్టీల పార్లమెంట్ సభ్యులు పీకే బిజు, ఎంబీ రాజేష్, డాక్టర్ ఎ.సంపత్ హెచ్‌సీయూ విద్యార్థులకు సంఘీభావం తెలపడానికి రావడంతో సెక్యూరిటీ సిబ్బంది వారిని ప్రధాన గేటు వద్దే అడ్డుకున్నారు. దీంతో వాగ్వివాదం చోటు చేసుకుంది.