: ‘సర్దార్ మహల్’లో ఇంటర్నేషనల్ స్థాయి ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తాం: మంత్రి కేటీఆర్


హైదరాబాద్ 'సర్దార్ మహల్'లోని జీహెచ్ఎంసీ సౌత్ జోన్ కార్యాలయాన్ని చాంద్రాయణ గుట్టకు తరలిస్తామని.. ఆ తర్వాత, సర్దార్ మహల్ లో ఇంటర్నేషనల్ స్థాయిలో ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈరోజు పాతబస్తీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా చార్మినార్ దగ్గర పాదచారుల ప్రాజెక్టును పరిశీలించారు. ఆరు నెలల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని, చార్మినార్ పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే చార్మినార్ పోలీస్ స్టేషన్ ను ఇక్కడి నుంచి తరలిస్తామని అన్నారు. పర్యావరణ పరిరక్షణ నిమిత్తం బ్యాటరీ ఆటోలను ప్రవేశపెడతామన్నారు. మంత్రి వెంట మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఉన్నారు.

  • Loading...

More Telugu News