: బీహార్‌లో నేటి నుంచి మందుబాబుల‌కు క‌ష్టాలు


బీహార్‌లో మందుబాబుల‌కు నేటి నుంచి క‌ష్టాలు ప్రారంభ‌మ‌య్యాయి. రాష్ట్రంలో పాక్షికంగా మద్యం అమ్మకాలను నిషేధించారు. రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విస్తరిస్తారు. నేటి నుంచి బీహార్ లోని గ్రామీణ ప్రాంతాల్లో దేశీయంగా ఉత్పత్తి అయ్యే మద్యంతోపాటు ఇతర స్పైస్ లిక్కర్ను కూడా బ్యాన్ చేస్తున్నారు. మద్యనిషేధం విషయంలో తాము ఎలాంటి విమర్శలనూ పట్టించుకోబోమనీ, అనుకున్నది సాధించి తీరతామని బీహార్ సీఎం నితీశ్ కుమార్‌ ఇప్ప‌టికే సెలవిచ్చారు. మద్యం బారినపడి ప్రాణాలు కోల్పోతున్న ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాలన్న సదుద్దేశంతో బీహార్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్మకాలపై నిషేధం విధించింది. నిబంధనలు అతిక్రమించి మద్యం అమ్మకాలు సాగించిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. హెచ్చరికను లెక్కచేయకుండా మద్యం అమ్మకాలు చేపడితే బీహార్ మద్యం పాలసీ సవరణ చట్టం 2016 ప్రకారం శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News