: సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకుంటున్న వారికి జైట్లీ తీపి కబురు.. నేటి నుంచే అమలు
కొండంత ఆశతో తమ సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకుంటున్న వారికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ అందించిన తీపి కబురు నేటి నుంచి అమలు కానుంది. తొలిసారి ఇంటిని కొనుగోలు చేస్తున్న వారు నేటి నుంచి అదనపు పన్ను ప్రయోజనాలను పొందుతారు. అయితే కొనుగోలు చేస్తున్న ఇంటి విలువ రూ.50 లక్షల లోపు, దానిపై తీసుకున్న రుణం రూ.35 లక్షల లోపు ఉండాలి. బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తొలిసారి ఇంటి కొనుగోలు చేసేవారు రుణ వడ్డీపై రూ.50,000 వరకు అదనపు పన్ను ప్రయోజనాన్ని పొందే వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. దీంతో తొలిసారి ఇంటిని కొనుగోలు చేసేవారు మొత్తంగా ఇంటి రుణ వడ్డీపై ఏడాదికి రూ.2.5 లక్షలు మినహాయింపు పొందొచ్చు.