: తండ్రి అంత్యక్రియలకు వెళుతుండగా విమానప్రమాదం.. కెనడా మాజీ మంత్రి, భార్య, కుటుంబసభ్యులు దుర్మరణం
తండ్రి అంత్యక్రియలకు వెళుతుండగా జరిగిన విమాన ప్రమాదంలో కెనడా మాజీ మంత్రి, ఆయన భార్య, ఒక సోదరి, ఇద్దరు సోదరులు దుర్మరణం చెందారు. రెండు రోజుల క్రితం ఐల్-ద-ల-మడిలీన్ కు మాజీ మంత్రి జీన్ లపియోర్రె (59), ఆయన కుటుంబసభ్యులు ప్రైవేటు విమానంలో బయలుదేరి వెళుతున్నారు. మాగ్ డాలెన్ ఐలాండ్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటుండగా ఈ విమాన ప్రమాదం జరిగింది. విపరీతమైన మంచు, గాలులు వీస్తుండటంతో విమానం ల్యాండయ్యేందుకు పరిస్థితులు అనుకూలించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు క్యుబెక్ పోలీసులు అధికారులు తెలిపారు. ఈ సంఘటనలో పైలట్ కూడా చనిపోయాడు. కాగా, ఈ సంఘటనపై ప్రధాన మంత్రి జస్టిన్ ట్రడో సంతాపం వ్యక్తం చేశారు.