: జపాన్లో భూకంపం.. సునామీ ముప్పులేదు


జపాన్ నైరుతి తీర ప్రాంతంలోని హన్ష్ ద్వీపంలో ఈరోజు భూకంపం సంభవించిన‌ట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.0గా నమోదైన‌ట్లు తెలిపింది. అక్క‌డి కిన్‌కి రీజియన్‌లో ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చింది. భూకంపం వ‌ల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని స‌మాచారం. కాగా, సునామీ వచ్చే సూచనలు లేవని స్థానిక ఉన్నతాధికారులు వెల్ల‌డించారు. ఈ భూకంపం కారణంగా సదరు ప్రాంతంలో నడిచే బుల్లెట్ రైళ్లను మాత్రం తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఓ మీడియా సంస్థ ప్రకటించింది. పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News