: గుంటూరులో దారుణం... గుమస్తా దారుణ హత్య


గుంటూరు నగరంలోని అరండల్ పేటలో దారుణం జరిగింది. ఒక మినుముల వ్యాపారి వద్ద పనిచేసే గుమస్తా శ్రీనివాసరావును గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. కోటప్పకొండ దగ్గర శ్రీనివాసరావు మృతదేహాన్ని దుండగులు తగులబెట్టారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మినుముల వ్యాపారానికి సంబంధించి చోటు చేసుకున్న ఆర్థిక లావాదేవీలే ఇందుకు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News