: ఏపీలో కొత్త విద్యుత్తు ఛార్జీలు నేటి నుంచే అమలు!


ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి కొత్త విద్యుత్తు ఛార్జీలు అమల్లోకి వస్తున్నాయి. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్‌ చార్జీల టారీఫ్‌ ను ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి నిన్న‌ విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే. దీని ప్ర‌కారం వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో విద్యుత్తు ఛార్జీల 2శాతం పెంపు అమల్లోకి వస్తోంది. దీనిలో ఊర‌ట నిచ్చే అంశం ఏంటంటే.. గృహ వినియోగదారులకు ఛార్జీలను పెంచలేదు. కానీ గత ఏడాది వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని వారిని గ్రూపులుగా చేయడంవల్ల స్వల్ప భారంపడే అవకాశముంది. ఇక వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో మాత్రం 2శాతం పెంపు అమల్లోకి వస్తోంది. రైల్వేలకు పెంపు నుంచి మినహాయింపు లభించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సదస్సులు నిర్వహించి వినియోగదారుల అభిప్రాయాలు కూడా సేకరించి తుది నిర్ణయం తీసుకున్నామని సంబంధిత అధికారులు తెలిపారు. గృహ వినియోగ దారులపై విద్యుత్‌ చార్జీల పెంపు భారం మోపలేదని, విద్యుత్‌ను సరసమైన ధరకు అందించాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News