: ఏపీలో ‘కేడర్’ కూడా జంప్!...సైకిలెక్కిన 250 మంది ‘అనంత’ కాంగ్రెస్, వైసీపీ నేతలు


కొత్త రాష్ట్రం తెలంగాణలో వలసలు దాదాపుగా పూర్తయ్యాయి. అదే సమయంలో మరో తెలుగు రాష్ట్రం ఏపీలో వలసలు జోరందుకున్నాయి. ఇప్పటిదాకా వైసీపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరగా, మరో ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. నేతలు మారుతున్నా, చాలా చోట్ల కింది స్థాయి కేడర్ మాత్రం అంత ఈజీగా పార్టీలు మారడం లేదు. అయితే ఏపీలో కేడర్ కూడా పార్టీలు మారడం మొదలైంది. అనంతపురం జిల్లాలో పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డికి షాకిస్తూ ఆయన సొంత నియోజకవర్గం మడకశిరకు చెందిన 250 మంది గ్రామ, మండల స్థాయి కాంగ్రెస్, వైసీపీ నేతలు నిన్న టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నిన్న హైదరాబాదులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సమక్షంలో వారంతా టీడీపీలోకి చేరిపోయారు. వీరిలో మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, సింగిల్ విండోల డైరెక్టర్లు ఉన్నారు. గడచిన ఎన్నికల్లో రఘువీరాపై విజయం సాధించిన టీడీపీ ఎమ్మెల్యే తిప్పేస్వామి వీరందరినీ చంద్రబాబు వద్దకు తీసుకువచ్చారు.

  • Loading...

More Telugu News